నారా లోకేష్‌ను కూడా అరెస్ట్‌ చేస్తాం – AP CID

-

నారా లోకేష్‌ని కూడా విచారించాల్సి ఉంటుందని… లోకేష్‌ని కూడా అదుపులో తీసుకుంటామని సంచలన ప్రకటన చేశారు ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్. ఇది లోతైన ఆర్ధిక నేరం. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని బాంబ్‌ పేల్చారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో దాదాపు రూ. 550 కోట్ల వరకూ అవినీతి జరిగిందని సిఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు.

AP CID Chief Sanjay

చంద్రబాబుకు అన్ని విషయాలు తెలిసే జరిగాయని… ఈ కేసులో ఆయనపై ఆరోపణలు నిరూపితం అయితే పదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చని తెలిపారు. ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటామని.. మిగిలిన విచారణ సంస్థల సహాయం కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. జ్యుడీషియల్ రిమాండ్ ను అడుగుతామని.. 370 కోట్లలో 270 కోట్లు దారి మళ్ళాయని పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయలతో నైపుణ్య సెంటర్లను ఏర్పాటు చేశారని చెప్పారు సిఐడి చీఫ్ సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version