చంద్రబాబు అనేక కుంభకోణాల్లో సూత్రధారి – అంబటి రాంబాబు

-

తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు కావటం దురదృష్టకరం అన్నారు మంత్రి అంబటి రాంబాబు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది అక్రమ అరెస్టు కాదు.. అనివార్యమైన అరెస్టన్నారు. కక్షసాధింపు చర్య అని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనేక కుంభకోణాల్లో సూత్రధారి చంద్రబాబని ఆరోపించారు. వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు.

నేరాలకు పాల్పడే వారు ఏ స్థాయిలో ఉన్నా అరెస్టు చేయటం, కోర్టులో ప్రవేశపెట్టడం చట్టం ప్రకారం అవసరమని పేర్కొన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయునట్లు అవుతుందన్నారు. చంద్రబాబు అమరావతిలో అసైన్డ్ భూములు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో మార్పు వంటి అనేక కుంభకోణాలు చేశారని ఆరోపించారు. ఈడీ, ఇంటెలిజెన్స్, సీఐడీ, ఐటీ అన్ని విచారణ సంస్థలు లోతుగా విచారణ చేశాయని.. ఈ స్కాంలలో ఉన్న పలువురిని విచారణ చేసిన తర్వాత అనేక విషయాలు బయటకు వచ్చాయన్నారు.

ఈ మొత్తం సమాచారంలో అసలు సూత్రధారి చంద్రబాబు అనే తేలిందన్నారు. సీమెన్స్ కంపెనీకి ఈ కుంభకోణంతో సంబంధం లేదని.. సీమెన్స్ కంపెనీ కోర్టులో 164 నోటీసులో స్పష్టం చేశారని తెలిపారు. షెల్ కంపెనీల ద్వారా ప్రజా ధనం లూటీ చేస్తే చంద్రబాబును అరెస్టు చేయకూడదా..? అని ప్రశ్నించారు.

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే సింపథీ వస్తుందని మాకు తెలియదా..? అని ప్రశ్నించారు. ఎక్కడైనా ఒక ప్రైవేటు కంపెనీ ఒక ప్రభుత్వానికి మూడు వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందా..? అని నిలదీశారు అంబటి రాంబాబు. నాటి ఫైనాన్స్ కార్యదర్శి, సీఎస్ 370 కోట్ల ప్రభుత్వ వాటా ఇవ్వకూడదని నోట్ ఫైల్ లో కూడా రాశారని తెలిపారు. అయినా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడితో నిధులు విడుదల అయ్యాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version