BREAKING : మాజీ మంత్రి నారాయణ కు ఏపీ సిఐడి నోటీసులు

-

BREAKING : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి నారాయణ కు ఊహించని షాక్‌ తగిలింది. మాజీ మంత్రి నారాయణ కు ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణ కు సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4న విచారానికి రావాలని ఆదేశించారు ఏపీ సీఐడీ పోలీసులు.

AP CID notices to former minister Narayana

వాట్సాప్ ద్వారా నోటీసు పంపిన అధికారులు.. ఈ నెల 4న విచారానికి రావాలని ఆదేశించారు. కాగా, స్కిల్ డెవలప్​మెంట్ సంస్థ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిరోజుల నుంచి నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇవాళ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ‘సత్యమేవ జయతే’ పేరుతో నిరసన దీక్ష చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version