చంద్రబాబును జైలులో చూసి షేక్ అయ్యా : నారా లోకేశ్

-

చంద్రబాబును జైలులో చూసి షేక్ అయ్యా అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సైకో జగన్ ఫ్యాక్షన్ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు. రాజ్యాంగాన్ని కాలరాశారని సోషల్ మీడియా వేదికగా ఫైర్‌ అయ్యారు. సత్యాన్ని వధించారు, ధర్మాన్ని చెరపట్టారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు గారిని అక్రమ అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారని మండిపడ్డారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తోన్న అరాచకాలని నిరసిస్తూ మహాత్మా గాంధీ జయంతి రోజైన నేడు‌.. నిరాహార దీక్ష చేసి చంద్రబాబు గారికి సంఘీభావం తెలుపుతున్నానని తెలిపారు. సత్యమేవ జయతే అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మంది పై కేసా? పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తారా? వీళ్ళ తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు గారి అరెస్ట్ వార్తలు చూసారని, పసుపు రంగు దుస్తులు కట్టుకున్నారని, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారన్నారు. ఒక పని చేయండి రాజద్రోహం కేసు పెట్టి…ఉరిశిక్ష వేసేయండి. జగన్ కి పిచ్చి పీక్స్ లో ఉన్నట్లు ఉంది. కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోడికి సరే…అమలు చేసినోడి బుర్రా బుద్ధీ ఏమయ్యింది? అని ప్రశ్నించారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version