ఏపీ CID మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సిఐడి చీఫ్ సంజయ్ కి ఊహించని షాక్ తగిలింది.ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కుమార్ పైన సస్పెన్షన్ వేటు వేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వ హయాంలో… కక్షపూరితంగా సిఐడి వ్యవహరించిందని… దీనికి కారణం సంజయ్ కుమార్ అని… విచారణలో తేలిందట. అలాగే… సంజయ్ కుమార్ ఏపీ సిఐడి చీఫ్ కాకముందు… ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ గా పని చేసిన సంగతి తెలిసిందే.

ap cid sanjay

అయితే ఆ సందర్భంగా దాదాపు కోటి రూపాయలు మేర నిధులు దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ శాఖ… తేల్చిందని సమాచారం. పనులు పెద్దగా జరగకుండానే ఎక్కువ స్థాయిలో డబ్బులు ఖర్చు చేసినట్లు.. అధికారుల విచారణలో తేలిందట. ఈ మేరకు… చంద్రబాబు ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు రిపోర్టు అందించినట్లు సమాచారం. ఇక ఈ రిపోర్ట్ అందగానే ఏపీ మాజీ సిఐడి చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. సంజయ్ హెడ్ క్వార్టర్స్ విడిచి ఎక్కడికి వెళ్ళకూడదని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే టిడిపి నాయకులపై.. అధికారులు గుర్తించారట. వీటన్నిటి నేపథ్యంలోనే సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version