ఈ రోజు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటి కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ తో సమావేశం సమావేశం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మ. 3 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సా. 5 గంటలకు రోడ్లు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు సమావేశం ఉంటుంది.
ఏపీకి సంబంధించిన వివిధ అంశాలు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు చంద్రబాబు నాయుడు. కాగా, నేడు విశాఖ, ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉండనుంది. ఉ.11కు విశాఖ ఎయిర్‌పోర్టుకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. మ.1:30కి ఢిల్లీ చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. మ.2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.