నేడు జగన్ ప్రెస్ మీట్ ఉండనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియాతో ముఖాముఖి కానున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ఆయన రాష్ట్ర రాజకీయ పరిణామాలు, బడ్జెట్ అంశాలు, సూపర్ సిక్స్ హామీల అమలు, అలాగే వైసీపీ నేతల అరెస్టులపై మాట్లాడనున్నట్టు సమాచారం.
ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక అటు నేడు విశాఖ, ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉండనుంది. ఉ.11కు విశాఖ ఎయిర్‌పోర్టుకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. మ.1:30కి ఢిల్లీ చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. మ.2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.