BREAKING: జన్మభూమి-2కు ముహూర్తం ఖరారు..ఎప్పటి నుంచంటే ?

-

ఏపీ ప్రజలకు అలర్ట్‌. జన్మభూమి-2కు ముహూర్తం ఖరారు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి-2 కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 17,500 కిలో మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు.. గ్రామాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామని వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

AP CM Chandrababu Naidu has finalized the date for Janmabhoomi-2

 

ప్రతి గ్రామానికి ఏం అవసరమో గుర్తించి సదుపాయాలు కల్పిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కాగా ఢిల్లీ నుంచి ఏపీ మంత్రి నారా లోకేష్ కు పిలుపు వచ్చింది. దీంతో కొద్దిసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు నారా లోకేష్. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోనున్నారు నారా లోకేష్. ఇవాళ సాయంత్రం పలువురు ఎన్డీయే కీలక నేతలను కలవనున్నారు మాజీ మంత్రి నారా లోకేష్. ఎన్డీయే లో కీలక భాగస్వామి గా టిడిపి పార్టీ ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version