సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెట్టే వారికి సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారికి ఇదే చివరి రోజు అని హెచ్చరించారు. సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వారికి అదే చివరిరోజు అని వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ భారతిపై చేసిన అసభ్య వ్యాఖ్యల సందర్భంలో చంద్రబాబు కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీసీలు టీడీపీకి వెన్నెముక అని.. జిల్లాల వారీగా బీసీల అభివృద్ధికి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఆగిరిపల్లి లో 206 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని చెప్పిన ఆయన.. మార్గదర్శిలు వచ్చి ఈ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఆగిరిపల్లి లో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే బాధ్యత జిల్లా కలెక్టర్ యంత్రాంగం తీసుకోవాలని సూచించారు. బీసీ వర్గానికి చెందిన నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు.. కోటయ్య పశువుల పాకను పరిశీలించి.. గేదెల పెంపకం ద్వారా వచ్చే ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు.