నేడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బుధవారం సాయంత్రం ఆయన కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం 8 గంటలకు తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు. అనంతరం తిరిగి సచివాలయానికి చేరుకుని సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత మంత్రులకు శాఖలు కేటాయించి ముఖ్యమైన ఐదు దస్త్రాలపై సంతకం చేస్తారు.

అయితే శ్రీవారి దర్శనం కోసం బుధవారం సాయంత్రం వెళ్లిన చంద్రబాబుకు రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తిరుమల వెళ్తూ తిరుపతిలోని తెలుగుదేశం కార్యాలయం వద్ద వాహన శ్రేణి ఆపి కార్యకర్తలకు అభివాదం చేసి వెళ్లారు. రాత్రికి తిరుమలలో బస చేసిన చంద్రబాబు.. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఉదయం 8గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు.

సీఎం పర్యటన సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. గాయత్రి నిలయం వద్ద సీఎంకు స్వాగతం పలికేందుకు వాహనం వద్దకు టీటీడీ అధికారులు ఎవరూ రాలేదు. ఆయన వాహనం దిగి గాయత్రీ నిలయం లోపలికి వెళ్లిన తర్వాత పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు టీటీడీ ఇన్‌ఛార్జి ఈవో వీరబ్రహ్మం యత్నించగా సీఎం తిరస్కరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version