ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఆర్బీకేల్లోనూ డ్రోన్ల ప్రయోగం

-

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాబార్డ్‌ స్టేట్‌ క్రెడిట్‌ సెమినార్‌ 2022–23 సిఎం క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్.. రైతులకు శుభ వార్త చెప్పారు. ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకువస్తామని… వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామ స్థాయిలోనే అభివృద్ధి చేస్తామని ప్రకటన చేశారు జగన్‌. వ్యవసాయ రంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై దృష్టి పెడతామన్నారు.

16 కొత్త మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నామని… ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌కాలేజీలను నాడు – నేడు కింద అభివృద్ధిచేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని.. గ్రామ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని… దాన్ని గ్రామీణ అర్థిక వ్యవస్థకు జోడించడంలో పిల్లలే ప్రధాన పాత్ర పోషిస్తారని వెల్లడించారు.

కోవిడ్‌ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయరంగం మద్దతుగా నిలిచిందని.. రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నా బార్డ్, బ్యాంకులు సహాయ పడుతున్నాయని చెప్పారు. కోవిడ్‌ సమయంలో చాలా మంచి సహాయాన్ని అందించాయని.. రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.ఆర్బీకేల ద్వారా ఇ– క్రాప్‌చేసి, పారదర్శకంగా చేస్తున్నామని.. సాగుచేస్తున్న రైతులు నష్టపోతే ఆదుకుంటున్నామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version