మళ్ళీ మాగనూరు స్కూల్ లో ఫుడ్ పాయిజన్..?

-

వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి  పది రోజులు కూడా గడవలేదని మాజీ మంత్రి హరీశ్  రావు పేర్కొన్నారు.  మళ్ళీ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిందని  తెలిపారు.  30 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో మహబూబ్ నగర్ జిల్లా దవాఖానలో చేరిన దుస్థితి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా.. ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు.

తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలకు ఉపక్రమించడం లేదు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయి. మాటలే తప్ప చేతలు లేని  నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version