అమరావతిలో ఏర్పాటు చేసే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు అనుసంధానంగా 5 జోనల్ హబ్ లను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర హబ్ లకు కేంద్రంగా అమరావతి హబ్ పని చేస్తుందన్నారు. 5 జోనల్ హబ్ లకు దేశంలోని 25
ఐఐటీ లను లింక్ చేయాలని సూచించారు. అటు ఆంధ్రప్రదేశ్ లో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగుల సంఖ్య పై వివరాలు సేకరించాలని నూతన ఐటీ పాలసీలపై సమీక్షలో సీఎం చెప్పారు.
2029 నాటికి రాష్ట్రంలో 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో నైపుణ్యాభివృద్ధి కోసం డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మిస్తామని చెప్పారు. స్టార్టప్ లకు రూ.25లక్షల సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా యూత్ లో స్కిల్ డెవలప్ మెంట్ కోసం కృషి చేస్తామన్నారు. మరిన్నీ ఐటీ పాలసీ లపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.