అమిత్‌ షా కు వైఎస్ జగన్‌ లేఖ.. స్పందిస్తారా?

-

ఏపీ విషయంలో కేంద్రం వైఖరి కాస్త బాగానే ఉందనే కామెంట్లు గత కొంతకాలంగా బలంగా వినిపిస్తున్నాయి!! గతంలో చంద్రబాబు హయాంలో కూడా మోడీ అండ్ కో కాస్త పాజిటివ్ గానే స్పందించినా.. అది టీడీపీ ఖాతాల్లో పడిపోవడం.. ఏరుదాటిన తర్వాత బీజేపీని బోడి మల్లన్నగా బాబు చిత్రీకరించడంతో ఆ సంగతులు జనాల్లోకి రాలేదు! ఆ సంగతులు అలా ఉంచితే… తాజాగా అమిత్ షా కు ఏపీ సీఎం జగన్ ఒక లేఖ రాశారు!

అవును.. అసలే కరోనా కాలం, దారుణంగా ఖజానా పరిస్థితి.. దానికి తోడు ఊహించని రీతిలో వర్షాలు వరదలు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆదుకోవాలని అమిత్ షా కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న వర్షాల విషయాన్ని ప్రస్థావించిన జగన్… భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామని.. తక్షణమే రూ.2250 కోట్ల ఆర్థికసాయం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదే క్రమంలో.. ఇప్పటికే ఏపీలో కరోనా మహమ్మారితో ఆర్థికంగా నష్టపోయి ఉన్నామని.. ఇప్పుడు దీనికి తోడు ఈ వర్షాలు, వరదలు తోడవ్వడంతో పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయని జగన్ అమిత్ షా కు తెలిపారు. ఈ పరిస్థితుల్లో జన జీవితం అస్తవ్యస్తమైందని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని షా కు జగన్ లేఖలో తెలిపారు! అలాగే… నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని కూడా ఏపీకి పంపాలని జగ్న లేఖలో కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version