ఈ నెల 7న 44,303 పాఠశాలల్లో ఒకేరోజు మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సెక్రెటరీ కోన శశిధర్ తెలిపారు. 38,319 మండలపరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు, 2807 మునిసిపల్ పాఠశాలలు, 1054 రెసిడెన్షియల్, 2843 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మీట్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచీ మధ్యాహ్నం 1 గంట వరకూ సమావేశం కొనసాగుతుంది. కోటి మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొంటారు. పిల్లలు స్వయంగా తయారు చేసిన ఇన్విటేషన్ కార్డులు తలిదండ్రులకు ఇప్పించాం. మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీ. Holistic Progress Card పిల్లలకు నచ్చే విధంగా తయారుచేసాం.
ప్రతి విద్యార్ధి గురించి ఉపాధ్యాయులు స్వయంగా రాస్తారు. ప్రతీ పేరెంట్ కి Holistic Progress Card ఉపాధ్యాయులు స్వయంగా ఇవ్వడం ద్వారా ఇద్దరి మధ్య అనుసంధానం కలిగిస్తున్నాం. తల్లులకు ఒక రంగోలీ పోటీ, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ నిర్వహిస్తాం. 900 స్కూళ్ళలో హెల్త్ స్క్రీనింగ్ చేసామ. మిగిలిన స్కూళ్ళలో కూడా జరుగుతుంది. పూర్వ విద్యార్ధులు, డోనార్లు ఉంటే వారి నుంచీ డొనేట్ చేయిస్తాం. ఎవరైనా జీవితంలో స్ధిరపడిన పూర్వ విద్యార్ధితో మాట్లాడిస్తాం. పేరెంట్ ఇచ్చే సూచన, కంప్లైంట్ కూడా తీసుకుంటాం. మధ్యాహ్న భోజన పధకంలో ఇచ్చే భోజనం తలిదండ్రులు అందరికిక ఇస్తాం. మధ్యాహ్న భోజన పధకం పై తలిదండ్రుల సూచనలు తీసుకుంటాం. ఇందులో పొలిటికల్ బ్యానర్లు ఏవి ఉండవు అని కోన శశిధర్ పేర్కొన్నారు.