ఏపీ మంత్రి వర్గం ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక మీదట రాష్ట్రంలో ఆన్‌లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద క్రీడలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిర్వాహకులు మొదటి సారి పట్టు బడితే ఏడాది జైలు, రెండో సారి పట్టు బడితే రెండేళ్ల జైలు, జరిమానా విధించేలా చట్టం చేయనున్నారు. దీనికి సంబంధించి జీవో జారీ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది.
అలానే ఆన్ లైన్ జూదం ఆడుతూ పట్టుబడితే ఆరునెలల జైలు శిక్ష కూడా విధించనున్నారు. ఇక మొన్న ఏకంగా ఏపీ మంత్రి సోదరుడే పేకాట క్లబ్ నిర్వహిస్తూ దొరికిపోవడం కలకలం రేపింది. దీంతో ఈ విషయం సీరియస్ అయినట్టు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణాలో ఈ ఆన్ లైన్ ఆటల మీద నిషేధం ఉంది. కాస్త లేట్ అయినా ఏపీ ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం తీసుకుందని అంటున్నారు జనం.