అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీశారు : మంత్రి పయ్యావుల కేశవ్

-

అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీశారని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని పేర్కొన్నారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రావాలన్నారు. ఏపీకి వైసీపీ హానికరం అని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఆదాయం తగ్గింది. ఏపీని వైసీపీ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చింది అన్నారు. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. 

వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను సైతం నాశనం చేసింది. కూటమి ప్రభుత్వాన్ని చూసి ప్రస్తుతం వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. గత ప్రభుత్వం బక్కోడి బువ్వను లాక్కునేందుకు యత్నించింది. బ్రాండ్ చంద్రబాబు వల్లనే ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయి. నాటి ప్రభుత్వం ఏపీని విధ్వంసం చేసింది.  వైసీపీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అందుకే మా సీఎం చంద్రబాబు సూచించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news