ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు మరోసారి చుక్కెదురు అయింది. ఏపీ స్కిల్ స్కాం కేసులో బెయిల్‌పై లంచ్ మోషన్ పిటిషన్‌ను నిరాకరించిన హై కోర్టు… చంద్రబాబుకు బెయిల్ ఇవ్వబోమని తెలిపింది. దీంతో ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు మరోసారి చుక్కెదురు అయింది. ఇక ఏపీ స్కిల్ స్కాం కేసులో బెయిల్‌పై లంచ్ మోషన్ పిటిషన్ సందర్భంగా 17Aపై ముకుల్ రోహత్గి కీలక వ్యాఖ్యలు చేశారు.
పాత నేరాలకు పాత చట్టాలు వర్తిస్తాయని..17A సవరణ సందర్భంగా చట్టంలో చాలా స్పష్టం చేశారని వివరించారు. 2018లో 17A వచ్చిన తర్వాత జరిగే నేరాలకే 17A అమలు చేయాలని చట్టంలోనే పేర్కొన్నారని… నేరం 2015-16లో జరిగింది కాబట్టి బాబుకు 17A వర్తించదన్నారు. చంద్రబాబుకు పాత చట్టాలే వర్తిస్తాయని చెప్పారు ముకుల్ రోహత్గి. నేరం జరిగిన రోజున ఉన్న చట్టాలే అమల్లోకి వస్తాయని ముకుల్ రోహత్గి స్పష్టం చేశారు.