ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక తొలిరోజు పరీక్షల కోసం సెట్ 1 పేపర్ ఎంపిక చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌడ్ వెల్లడించారు.

ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 8.45 గంటలకు కల్లా… పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. శుక్రవారం మొదటి మొదటి ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానుండగా శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు తెలిపారు.