విజయసాయి రెడ్డి రాజీనామా పై స్పందించిన మంత్రి లోకేష్.ఎక్కడికి వెళ్లినా వదలం !

-

విజయసాయి రెడ్డి రాజీనామా పై స్పందించారు ఏపీ మంత్రి లోకేష్. తల్లి, చెల్లికే జగన్ పై నమ్మకం లేదని… ఇంకా పార్టీ నాయకులకు ఏమి ఉంటుందని సెటైర్లు పేల్చారు మంత్రి నారా లోకేష్. పార్టీని వీడిన విజయసాయి రెడ్డి గురించి.. ఏం మాట్లాడుతాం ఇక అని చురకలు అంటించారు.

Nara-Lokesh-Vijayasai-Reddy

గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు మంత్రి నారా లోకేష్‌. విశాఖలో జరిగిన అక్రమాలపై కూడా విచారణ జరుగుతుందని చెప్పారు.. 7 నెలల్లో రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్‌. రానున్న ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి గెలవాల్సి ఉందని వివరించారు.. దావోస్‌కు జ్యూరిచ్‌కు మధ్య తేడా రోజాకు తెలియదన్నారు.. రెడ్‌బుక్‌ అంటే ఎందుకు వైసీపీ నాయకులు భయపడుతున్నారు.. విశాఖలో 90 రోజుల్లో టీసీఎస్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news