ఏపీ మంత్రి నారాలోకేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూస్తామా? లేదా ఉపముఖ్యమంత్రిగా చూస్తామా? అని మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు మంత్రి నారాలోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఏ పదవి ఇచ్చినా అహర్నిషలు కష్టపడతా. పార్టీని బలోపేతం చేస్తా. అంతేకానీ పార్టీకి చెడ్డపేరు తీసుకురాను. ఒక వ్యక్తి ఓకే పదవిలో మూడు సార్లు ఉండకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకే నేను కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండకూడదని నిర్ణయించుకున్నా’ అని మంత్రి వెల్లడించారు. ఇదిలాఉండగా, నారాలోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఇటీవల తెలుగుతమ్ముళ్లు పెద్దఎత్తున డిమాండ్ చేయగా.. సీఎం చంద్రబాబు వారిపై సీరియస్ అయిన విషయం తెలిసిందే.