గద్దర్ కు బరాబర్ పద్మశ్రీ ఇవ్వం.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

-

గద్దర్ కు బరాబర్ పద్మశ్రీ ఇవ్వం అని.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పద్మ అవార్డులలో రాష్ట్రం పై కేంద్రం వివక్ష చూపించిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పేర్లు కేంద్రం పరిశీలించి.. అర్హులకే అవార్డులు ఇస్తుందని.. ఏ పేరు పడితే ఆ పేరు పంపితే పద్మ అవార్డులు ఇవ్వరు అన్నారు.

గద్దర్ కి అవార్డు ఎలా ఇస్తాం అని ప్రశ్నించారు. ఆయన భావాజాలం ఏంటి..? ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్ ఒకరు. బరాబర్ ఆయనకు పద్మ అవార్డు ఇవ్వం అని కుండబద్దలు కొట్టారు బండి సంజయ్. మా కార్యకర్తలను చంపి పాటలు పాడిన వ్యక్తి గద్దర్.. భయపడే ప్రశక్తే లేదు. వంద మంది భారతామాతాకి జై అని ఆందోళన చేస్తుంటే.. నక్సల్స్ భావాజాలం ఉన్న గద్దర్ కి పద్మ అవార్డు పేరు ఏవిధంగా పంపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news