సీఎం జగన్ కి బిగ్ షాక్.. జులై 11 నుంచి సమ్మెకు దిగనున్న మున్సిపల్ ఉద్యోగులు !

-

సీఎం జగన్ కు బిగ్ షాక్ ఇవ్వనున్నారు మున్సిపల్ ఉద్యోగులు. ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ శాఖ లో సమ్మె కు సిద్ధమయ్యారు మున్సిపల్ ఉద్యోగులు. మున్సిపల్ కార్మికులు అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం అంశంలో జగన్ సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వచ్చే నెల 11వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు… మున్సిపల్ కార్మికులు, ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వo 2019 ఆగస్టు నుంచి మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నా ఆక్యుపేషన్ హెల్త్ ఇన్సూరెన్స్ అలవెన్స్ నిలిపి వేయడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య బత్యం బకాయిల చెల్లింపు తో పాటు ఇంజనీ రింగ్ కార్మికులు సహా అందరికీ ఆరోగ్య భత్యం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా జూలై 11వ తేదీన సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని… దీనికి అందరు కార్మికులు సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version