ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం చోటుచేసుకుంది. టిడిపి ఎమ్మెల్యే సోదరుడు అరెస్టయ్యాడు. ఆలూరు కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో గుంతకల్ టిడిపి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ ను ఏపీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

వైద్య పరీక్షల అనంతరం ఆలూరు కోర్టులో… టిడిపి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను.. కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే 14 రోజుల రిమాండ్ అతనికి విధించింది కోర్టు. అనంతరం గుమ్మనూరు నారాయణను కర్నూలు జిల్లా జైలుకు తరలించారు అధికారులు.
సాంకేతిక ఆధారాలను పరిశీలించిన తర్వాత నారాయణను అరెస్టు చేశామని.. ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. త్వరలోనే మరికొంతమందిని కూడా ఈ కేసులో అరెస్టు చేయబోతున్నట్లు.. ఏ ఎస్పీ హుస్సేన్ పీరా స్పష్టం చేయడం జరిగింది. ఈ సంఘటనతో గుంతకల్ టిడిపి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కు ఊహించని షాక్ తగిలింది.