కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి అజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన ఆడబిడ్డల సిందూరాన్ని చెరిపేసిన వారి అంతు చూడాలని.. వారి సామాజిక వర్గానికి చెందిన సోదరిని మోడీ పంపాడని బాంబు పేల్చాడు. మన హిందువుల బట్టలు విప్పినందుకు.. ప్రతీకారం తీర్చుకోవడానికి వారి జాతి బిడ్డను పంపించాం అని హాట్ కామెంట్స్ చేశారు మధ్యప్రదేశ్ మంత్రి అజయ్ షా.

దింతో కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన మధ్యప్రదేశ్ మంత్రి అజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. కాగా కల్నల్ సోఫియా ఖురేషికి మధ్యప్రదేశ్‌తో పాత సంబంధం ఉంది. ఆమె ఛత్తర్‌పూర్ జిల్లాలోని నౌగాంగ్‌లో 5వ తరగతి వరకు చదివినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆమె తండ్రి అక్కడే ఉద్యోగం చేసేవాడు… అందుకే ఆమె చిన్నతనంలో నౌగాంగ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ యుద్ధం లో కల్నల్ సోఫియా ఖురేషీ కీలక పాత్ర పోషించాడు.
కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి అజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు
మన ఆడబిడ్డల సిందూరాన్ని చెరిపేసిన వారి అంతు చూడాలని.. వారి సామాజిక వర్గానికి చెందిన సోదరిని మోడీ పంపాడు
మన హిందువుల బట్టలు విప్పినందుకు.. ప్రతీకారం తీర్చుకోవడానికి వారి జాతి బిడ్డను పంపించాం – మధ్యప్రదేశ్… pic.twitter.com/uNZHqKBDZD
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2025