సీఎం జగన్ కు బిగ్ షాక్..ఇవాల్టి వాలంటీర్ల సమ్మె ఉండనుంది. ఇవాల్టి నుంచి పలు జిల్లాల్లో వాలంటీర్లు సమ్మెకు దిగనున్నట్లు తెలుస్తోంది. గౌరవ వేతనం పెంపు, సర్వీసులు క్రమబద్దీకరించాలని సమ్మె చేస్తున్నట్లు సమాచారం. “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం వాలంటీర్లకు చెందిన వాట్సాప్ గ్రూపులో హల్చల్ చేస్తున్నట్లు టాక్. కాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వారికి ప్రస్తుతం నెలకు రూ. 5 వేల గౌరవవేతనం ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా,
ఇక ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. ఇక ఇవాళ్టి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు క్రీడా పోటీలు జరుగుతాయి. అంటే ఏపీలో 47 రోజుల పాటు క్రీడా సంబరం జరుగనుందన్న మాట. గ్రామ వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరుగనున్నాయి.