SA Vs IND : నేటి నుంచి బాక్సింగ్ డే టెస్టు

-

South Africa vs India, 1st Test : దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ ను సమం చేసుకుని…. వన్డే సిరీస్ చేజిక్కించుకున్న టీం ఇండియా ఇప్పుడు అసలు సిసలు సమరానికి సమాయత్తమైంది. ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు మంగళవారం తెరలేవనుంది. పేస్ కు సహకరించే సెంచూరియన్ లో ఇరు జట్ల మధ్య నేటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

1992 నుంచి మొదలు కొని ఇప్పటివరకు 31 ఏళ్లలో ఎనిమిది సార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించిన టీం ఇండియా ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేకపోయింది. ఒకే ఒక్క సారి సిరీస్ “డ్రా” చేసుకొని మిగిలిన ఏడుసార్లు ప్రత్యర్థికి కప్పు అప్పజెప్పింది. ఈసారి ఆ లెక్కలు సరిచేయాలనే ఉద్దేశం తో భారతజట్టు ఉంటే…..అజేయ రికార్డు కొనసాగించాలని ప్రోటీస్ రెడీ అవుతున్నారు. మరి ఇవాళ్టి బాంక్సింగ్‌ డే టెస్ట్‌ మ్యాచ్‌ ను టీమిండియా ఎలా ఆడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version