24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి నియామకం కానుంది. టీటీడీ బోర్డు సభ్యుల నియామక కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ మేరకు ఇవాళ టీటీడీ పాలక మండలి జీవో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఏకంగా 24 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేయనున్నారు.
ఎమ్మెల్యే కోటాలో పొన్నాడ సతీష్, తిప్పేస్వామి, కరణం ధర్మశ్రీ టీటీడీ పాలక మండలిలో చోటు దక్కించుకున్నారని సమాచారం. అలాగే సనత్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, మేకా శేషుబాబు, పోకల అశోక్ కుమార్, రంప చోడవరానికి చెందిన షెడ్యూల్ మహిళకు బోర్డులో అవకాశం కల్పించనున్నారు. దాట్ల రమణమ్మ కూడా చోటు దక్కిందని సమాచారం. పొరుగు రాష్ట్రాలు, కేంద్ర మంత్రుల సిఫార్సులకు చోటు దక్కనుంది. ఈ మేరకు ఇవాళ టీటీడీ పాలక మండలి జీవో విడుదల అయ్యే అవకాశం ఉంది.