రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ను వాయిదా వేయాలని
ఏపీపీఎస్సీ ని కోరారు. సిలబస్ మార్పులు, పూర్తిస్థాయిలో సన్నద్ధత కోసం మరికొంత పలువురు అభ్యర్థులు
సమయం పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుద్యోగుల అభ్యర్ధన, ఆందోళన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని పలువురు ప్రజా ప్రతినిధులు సైతం ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష గడువు పెంపుపై సానుకూలంగా స్పందించిన ఏపీపీఎస్సీ, డీఎస్సీ తేదీల ప్రకటనలను బట్టి గ్రూప్-2 ప్రధాన పరీక్ష తేదీలపై నిర్ణయం తీసుకోనుంది.
ఈ క్రమంలో గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్ ప్రకారం.. జనవరి 5న జరగాల్సి ఉండగా అభ్యర్ధుల వినతి మేరకు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 23న ఈ పరీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడటంతో పాటు మెయిన్స్కు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించాక అధికారులు కొత్త తేదీపై అధికారిక ప్రకటన చేయనున్నారు.