విదేశాల్లో భర్త.. గర్భం దాల్చిన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్

-

తన భర్త  విదేశాల్లో ఉండగా.. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్  గర్భం దాల్చడంతో భర్త షాక్ కి గురయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.  దీంతో భార్యపై దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ కు భర్త ఫిర్యాదు చేశఆడు.  అమరావతికి చెందిన తాను విదేశాల్లో ఉండగా తన భార్య దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భం దాల్చిందని ఆమె భర్త మదన్ మోహన్.. దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు.

తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ ని కోరుతూ లేఖ రాశారు.  తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ.. భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశాడు. మరోవైపు  ఇటీవలే దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని   సస్పెండ్ చేశారు దేవదాయ శాఖ కమిషనర్. తాజాగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో అంతా ఆశ్యర్యపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version