ఇదేం ట్విస్ట్‌ మామ..లావణ్యను గెలుకుతున్న ప్రముఖ లాయర్‌ ?

-

లావణ్య, హీరో రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తాను చనిపోతున్నానంటూ టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య అర్ధరాత్రి పోలీసులు, మీడియాకు సూసైడ్ నోట్ పంపడం కలకలం రేపింది. దీంతో నార్సింగి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడారు. అయితే.. ఈ వివాదం తర్వాత.. మళ్లీ మీడియా ముందుకు వచ్చింది లావణ్య. ఈ సందర్భంగా లావణ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

Raj Tarun and Lavanya

రాజేష్ అనే వ్యక్తి నాకు మెసేజ్ చేశాడని… తాను ఒక అడ్వకేట్ ను అని.. నీ కేస్ నేను టేకప్ చేస్తాను అని మెసేజ్ పెట్టాడని వెల్లడించింది లావణ్య. యాక్టింగ్ అంటే ఇష్టం ఉంటే చెప్పు.. అవకాశం ఇప్పిస్తాను అన్నాడని తెలిపాడట. అప్పటికే బాధలో ఉన్న నన్ను రాజేష్ అనే అడ్వకేట్ మరింత ఇబ్బంది పెట్టాడని లావణ్య పేర్కొంది. ఇక జీవితం పై విరక్తి వచ్చిందని… నన్ను అడగకుండానే.. నాకు తెలియకుండానే ఉదయం డీజీపీ ఆఫీస్ కి వెళ్లి కలిశాడని తెలిపింది. నిన్న రాత్రి ఒక్కసారిగా డిప్రెషన్ కి లోనయ్యాను.. అందుకే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నానని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version