హోం మంత్రి అనితపై దారుణమైన పోస్టులు….వైసీపీ నేత అరెస్ట్‌ ?

-

అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి అనితపై అనుచిత పోస్టులు పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి అనితపై అనుచిత పోస్టులు పెట్టిన తరుణంలో సత్యసాయి జిల్లా నాగిరెడ్డి పల్లెకు చెందిన బాలాజీరెడ్డి అరెస్టు అయ్యాడు. నిందితుడ్ని అరెస్టు చేసి తీసుకువచ్చిన దేవరాపల్లి పోలీసులు….విచారణ చేస్తున్నారు.

v

అయితే.. సత్యసాయి జిల్లా నాగిరెడ్డి పల్లెకు చెందిన బాలాజీరెడ్డి వైసీపీ పార్టీకి చెందిన వాడని అంటున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇక తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని పై కూడా కేసు బుక్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అలాగే నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని… కొడాలి నాని పైన ఓ మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ మహిళ ఫిర్యాదును రికార్డ్ చేసుకున్న పోలీసులు ఫేస్బుక్ చేశారు. దీనిపై కొడాలి నాని కి నోటీసులు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొడాలి నాని పై కేసులు పెట్టాలని కూడా ఆదేశాలు వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version