ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ స్కూల్ బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో 6, 7వ తరగతి విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు. దాదాపు 6 మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఇంట్లో చెప్తే కొడతానని ఆ ఉపాధ్యాయుడు పిల్లలను బెదిరించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.

ఇక ఈ సంఘటన పట్ల ఎంఈఓకు ఫిర్యాదు చేసినా ఉపాధ్యాయుడి పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం జిల్లాలో దారుణం
మైనర్ స్కూల్ బాలికలను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడు
ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో 6, 7వ తరగతి విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు
దాదాపు 6 మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఇంట్లో… pic.twitter.com/1WB62s1vwN
— Telugu Scribe (@TeluguScribe) March 19, 2025