విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో వైఎస్సార్ పేరు తొలగింపు!

-

ఏపీ రాజకీయాలు మరోసారి వివాదాస్పదంగా మారాయి.గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం ఆధ్వర్వ్యంలో నడిచిన చాలా వరకు స్కీమ్స్‌కు పేర్లు మార్చారు. ఆ తర్వాత కొన్ని ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్ పేరు పెట్టారు.

అదేవిధంగా విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి సైతం వైఎస్సార్ పేరు నామకరణం చేశారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం చేసిన మార్పులను ప్రస్తుతం ఈ ప్రభుత్వం మార్పులు చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును తొలగించారు. కేవలం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా పిలువబడుతుందని విశాఖ పాలకవర్గం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news