తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి బడ్జెట్ సమావేశానికి కేసీఆర్ దూరం కానున్నారు. ఈ రోజు జరగబోయే బడ్జెట్ ప్రసంగానికి గైర్హాజరు కానున్నారు ప్రతిపక్ష నేత కేసీఆర్. గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు సభకు హాజరయ్యారు కేసీఆర్. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు కేసీఆర్. ప్రసంగం తో పాటు చర్చల కు కూడా దూరంగా ఉండనున్నారు కేసీఆర్.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ర్టంలోని రైతన్నల్లో ధైర్యం నింపడానికి బిఆర్ఎస్ ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో ఎండిపోతున్న పాటలను ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఎండిన వారి గడ్డితో అసెంబ్లీ కి వచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆగ్రహించారు. కేసీఆర్ పై కోపంతో మెడి గడ్డని ఎండబెడుతున్నారు.. అక్కడ ఇసుక దందా చేస్తున్నారని నిప్పులు చెరిగారు.