తిరుపతిలో దారుణం..ప్రియురాలిని చంపిన ప్రియుడు

-

తిరుపతిలో దారుణం జరిగింది. ప్రియురాలిని చంపాడు ఓ ప్రియుడు. మద్యం మత్తులో ప్రియురాలిని చంపాడు ప్రియుడు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి పరిధి శ్రీకాళ హస్తి మండలం రామలింగాపురం ఎస్టీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పుట్టుకతో మూగ ఉన్న కాటమ్మ భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన చెంచయ్యతో ప్రేమాయణం జరిగింది.

Atrocity in Tirupati Boyfriend killed his girlfriend

ఓ రైతు వద్ద ఇద్దరు కూలీ పనిచేస్తూ సహజీవనం చేస్తున్నారు. అయితే… నిన్న రాత్రి మద్యం మత్తులో కాటమ్మను చెంచయ్య కర్రతో తలపై కొట్టడంతో మృతి చెందింది. ఇక దీనిపై స్థానికులు.. పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… చెంచయ్యను అరెస్ట్‌ చేశారు. తమ మధ్య ఎలాంటి గోడవలు లేవని మత్తులో చేసినట్లు గా చెంచయ్య చెబుతున్నారు. కాగా దీనిపై కేసు బుక్‌ చేసి.. విచారణ చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news