కాకినాడలో విషాదం చోటు చేసుకుంది. కాకినాడలోని కాజులూరు మం. శలపాకలో ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కత్తులతో దాడి జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు బత్తుల రమేష్, బత్తుల చిన్ని, బత్తుల రాజుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్పీ విక్రాంతపాటిల్..దీనిపై విచారణ చేస్తున్నారు.
ఒకే కుటుంబం పై దాడి చేసినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్న పోలీసులు…దాడి జరిగిన సమయంలో కరెంటు పోయిందని గుర్తించారు. ఇక ఈ తరుణంలోనే దాడి చేసి పరారైన నిందితులు…కోసం గాలిస్తున్నారు.
అక్రమ సంబంధానికి సంబంధించి పాత పక్షులు నేపథ్యంలో ఈ ఘర్షణ జరిగినట్లు చెబుతున్నారు స్థానికులు. మృతులు మద్యం సేవించి చిన్నిపేటకు చెందిన పొట్టకాయల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను దూషించడంతో చెలరేగిందట వివాదం. అనంతరం రాడ్లు కత్తులతో నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు నలుగురు కలిసి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జి జి హెచ్ కు తరలించి… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గొల్లపాలెం పోలీసులు.