‘సిద్ధం’ స్లోగన్ తో వైసీపీ ఎన్నికలకు సిద్ధమైంది. ఇవాళ తొలిసభను భీమిలిలో నిర్వహిస్తుండగా….సభా ప్రాంగణంలో టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ నేతల కార్టూన్ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ‘సిద్ధం వేడుక వద్ద పెత్తందారులు. జగనన్న పాలనలో పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకుంటున్న ఈ పెత్తందారులపై యుద్ధానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా?’ అని ఆ ఫ్లెక్సీలను వైసీపీ ట్వీట్ చేసింది. వీటిని ఆ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.
టీడీపీ- జనసేన మధ్య పైకి మాత్రమే పొత్తులు కనిపిస్తున్నాయి. కానీ.. లోపల మాత్రం ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. పిఠాపురంలో టీ డీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ జయహో బీసీ కార్యక్రమం నిర్వహించాడు. కానీ.. దానికి పవన్ కళ్యాణ్ వాళ్ల ని పిలవలేదు. దాంతో వెళ్లి ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోమని జనసైనికుల్ని అక్కడి నుంచి తన్నితరిమేశారంటూ వైసీపీ పోస్ట్ పెట్టింది.