సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ..హైకోర్టులో పిల్ !

-

Backlash to CM Chandrababu PIL in High Court:  సీఎం చంద్రబాబుకు ఊహించని షాక్‌ తగిలింది. సీఎం చంద్రబాబు, మంత్రులు, నేతలు, వ్యాపారవేత్తలపై నమోదైన కేసులను సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ ఈ పిల్ దాఖలు చేశారు.

Backlash to CM Chandrababu PIL in High Court

స్కిల్, లిక్కర్, ఫైబర్ నెట్ స్కామ్‌లపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగే అవకాశాలు లేవని తెలిపారు. నిష్పాక్షిక, పారదర్శక, వేగవంతమైన దర్యాప్తు కోసం కేసులను సీబీఐ, ఈడీకి అప్పగించాలని కోరారు.

ఇక అటు మాజీ సీఎం జగన్‌కు సర్కార్ షాకిచ్చింది. పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్‌లో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వంలో 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి సీఎంకి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినవారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version