విజయవాడ దుర్గ గుడి ప్రధాన అర్చకులు బద్రీనాథ్ మృతి

-

విజయవాడ దుర్గ గుడి భక్తులకు అలర్ట్. దుర్గ గుడి ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో…దుర్గ గుడి ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మృతి చెందారని సమాచారం. అయితే… దుర్గ గుడి ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంతాపం తెలిపారు.

Badrinath, the chief priest of Durga temple in Vijayawada, died

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ లింగం బొట్ల బద్రీనాథ్ బాబు అకాల మరణం ఎంతో బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అకాలమరణం తీరని లోటు అన్నారు. ప్రధాన అర్చకులుగా శ్రీ లింగం బొట్ల బద్రీనాథ్ బాబు , అమ్మవారి అలంకరణ, ఆచార వ్యవహారాల్లో అపారమైన అనుభవం తో సేవలందించారని గుర్తు చేశారు. భక్తులకు తగిన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించిన ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ పేర్కొన్నారు మంత్రి ఆనం.

Read more RELATED
Recommended to you

Latest news