జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఆస్తిలో సగం జగన్ కాజేశాడు అంటూ బాంబ్ పేల్చారు జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. తాజాగా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన ఆవిర్భావసభ జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
నాతో సహా గత వైసీపీ ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వయిరీ చేసి.. ఎవరూ అన్యాయం చేశారో, ఎవరూ కోట్లు సంపాదించారో మొత్తం బయట పెట్టండి అంటూ డిమాండ్ చేశారు. నా ఆస్తిలో సగం, నా వియ్యంకుడి ఆస్తిలో సగం జగన్ కాజేశాడని ఆగ్రహించారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.