సీఎం యోగిని చూసి జగన్ బాగా నేర్చుకోవాలని సెటైర్లు పేల్చారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. తిరుపతిలో బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి…ఇవాళ మాట్లాడుతూ…వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేదని ఆగ్రహించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా అరాచక ప్రదేశ్ లోనా అంటూ ఫైర్ అయ్యారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి.
ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిని మారణాయుధాలతో చంపాలని చూస్తారా ? జనం ఓటు వేయకపోతే దాడులు చేస్తారా ? కొందరు అధికారుల అండతో అధికార పార్టీ నేతలు దాడులు చేయడం తగునా ? అని నిలదీశారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. పోలీసుల వైఫల్యం వల్లే దాడులు జరుగుతున్నాయి…వైసీపీ నేతల మాటలు నమ్మి అధికారుల కెరీర్ నాశనమైందని పేర్కొన్నారు.
శాంతి భద్రతలు ఎలా అమలు చేయాలో యూపీ సిఎం యోగీని చూచి నేర్చుకోమని జగన్మోహన్ రెడ్డికి సూచనలు చేశారు. ఏపీలో తాజాగా జరుగుతున్న ఆగడాలకు కర్త, కర్మ, క్రియ ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు.