భీమ్లాతో బాబు…తమ్ముళ్ళ తిరుగుబాటు!

-

మరి జగన్ ప్రభుత్వం నిజంగానే భీమ్లానాయక్ సినిమాపై కక్ష సాధించిందా? లేదా పవన్ ఫ్యాన్స్, ప్రతిపక్షాలు అలా క్రియేట్ చేసాయో తెలియదు గాని…తాజాగా రిలీజ్ అయిన భీమ్లానాయక్ సినిమా విషయంలో పెద్ద రచ్చ మాత్రం జరిగింది…అయితే ఈ రచ్చ తెలంగాణలో గాని, ఇంకా ఎక్కడ జరగలేదు..కేవలం ఏపీలోనే నడిచింది…పవన్ సినిమా కాబట్టే ఐదు షోలకు పర్మిషన్ ఇవ్వలేదని, టిక్కెట్ల రేట్లు తగ్గించారని, అలాగే రెవెన్యూ, పోలీసులని పెట్టి సినిమాని ఇబ్బంది పెట్టారని పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

అయితే పవన్ ఫ్యాన్స్ చెప్పినట్లు ఏపీలో అదే జరిగింది..ఎక్కువ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు..అలాగే టిక్కెట్ల రేట్లని తగ్గించే ఉంచారు…కానీ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అలా జరగలేదు..అక్కడ ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చారు…ఇటీవలే సినిమా టిక్కెట్ల రేట్లని భారీగా పెంచారు..దీని వల్ల సినిమా ఇండస్ట్రీకి చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పొచ్చు…కానీ ఏపీలో మిగతా వాటిపై ధరల నియంత్రణ లేని ప్రభుత్వం..సినిమా టిక్కెట్లని మాత్రం పేదవాళ్ళ కోసం తగ్గించామని చెబుతుంది..పైగా పవన్ సినిమాని బాగా ఇబ్బంది పెట్టేలా ముందుకెళ్లింది.

ఇక ఈ విషయంలో వైసీపీ మినహా..మిగిలిన పార్టీలు పవన్‌కు సపోర్ట్ ఇచ్చాయి..అలాగే టీడీపీ పెద్ద ఎత్తున పవన్‌కు సపోర్ట్ ఇచ్చింది..ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌లు పవన్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు పోస్టులు కూడా పెట్టారు. ఇలా బాబు, లోకేష్‌లు కూడా సపోర్ట్ చేయడంపై టీడీపీలో భిన్న వాదనలు వస్తున్నాయి…ప్రభుత్వం తప్పులని ఖండించాల్సిందే అని కొందరు తమ్ముళ్ళు అంటున్నారు.

అదే సమయంలో పవన్‌కు ఇబ్బంది అయితే..ఆయన కుటుంబం అంటే చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్ లాంటి వారు ఏ మాత్రం స్పందించలేదని, అలాగే పొత్తులో ఉన్న బీజేపీ, కాపు ముసుగులో ఉండే కొందరు మేధావులు స్పందించలేదని, అలాంటప్పుడు మనం స్పందించాల్సిన అవసరం ఏముందని కొందరు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. పవన్ సినిమాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం పెద్దగా లేదని అంటున్నారు..ఈ విధంగా భీమ్లా సినిమా విషయంలో తమ్ముళ్ళ మధ్య రచ్చ నడిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version