ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

-

నంద్యాల లోని, ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇవాళ నంద్యాలలో బహిరంగ చర్చ కు సవాల్ చేశారు భూమా అఖిల. ఇప్పటికే భూమా అఖిల బహిరంగ చర్చపై పోలీసులు నోటీసులు ఇచ్చారు.

బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే శిల్పా రవికి సవాల్ చేశారు మాజీ మంత్రి భూమా అఖిల. ఇవాళ సాయంత్రం 4 గంటలకు గాంధీ చౌక్ వద్ద చర్చకు రావాలని ఏర్పాట్లు చేశారు భూమా అఖిల. ఈ నేపథ్యంలోనే, 30 యాక్ట్ అమలులో ఉన్నందున అనుతిలేదని, అనుమతి లేకుండా ఏర్పాట్లు చేస్తున్నందున నోటీసులు ఇచ్చారు. భూమా అఖిల వ్యక్తిగత సహాయకునికి నోటీస్ ఇచ్చిన పోలీసులు.. ఇవాళ భూమా అఖిలను హౌస్ అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version