పోలీసుల అదుపులో భూమా అఖిలప్రియ

-

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత ఎ.వి. సుబ్బారెడ్డిపై దాడి ఘటన నేపథ్యంలో భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డలో ఆమెను అదుపులోకి తీసుకుని.. నంద్యాలకు తరలించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు అఖిలప్రియ, ఎ.వి.సుబ్బారెడ్డి వర్గాలు కొత్తపల్లి గ్రామం దగ్గర భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి. ఇరువర్గాల మధ్య కొంతకాలంగా వర్గపోరు, విభేదాలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో అఖిలప్రియ వర్గీయుడు ఎ.వి.సుబ్బారెడ్డిని కొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.

తనపై దాడి చేయడంపై ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే డైరెక్ట్‌గా కక్ష తీర్చుకోవాలంటూ అఖిల ప్రియ వర్గానికి సవాల్ విసిరారు. ఈ సమయంలో రెండు వర్గాల వారు పరుష పదజాలం వాడుతూ నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version