షమీ తల్లి ఆశీర్వాదం తీసుకున్న కోహ్లీ.. నెట్టింట ప్రశంసలు!

-

చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.2013 తర్వాత దాదాపు 12 ఏళ్లకు భారత జట్టు రోహిత్ శర్మ సారధ్యంలో చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విజయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు భారత జట్టుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అయితే, మ్యాచ్ గెలిచిన అనంతరం డ్రెస్సింగ్ రూములో ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం ట్రోఫీని ముద్దాడారు. ఈ క్రమంలోనే టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్‌ షమీ తల్లి ఆశీర్వాదాలను తీసుకున్నాడు. షమీ తన తల్లిని పరిచయం చేయగా.. ముందుగా ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version