తిరుమల భక్తులకు బిగ్‌ అలర్ట్‌… ఘాట్ రోడ్లలో టూవీలర్స్ పై నిషేధం !

-

 

Big alert for Tirumala devotees: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి ఘాట్ రోడ్లలో టూవీలర్స్ పై నిషేధం విధించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని టీటీడీ వెల్లడించింది.

Big alert for Tirumala devotees… ban on two wheelers on ghat roads

8వ తేదీన గరుడసేవ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముందు రోజు రాత్రి 9 నుంచి తిరిగి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్ల లో టు వీలర్స్ రాకపోకలను టీటీడీ నిషేధించినట్లు తెలియజేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతను ఇస్తూ ఇప్పటికే అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version