వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బిగ్ షాక్.. నేడో, రేపో అరెస్ట్..!

-

వైసీపీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన బెయిల్‌ పిటిషన్లు కొట్టేసింది. హైకోర్టులో 4 ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేశారు పిన్నెల్లి. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం సహా పిన్నెల్లి పై మూడు కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటికి వరకు ఈ కేసుల్లో మధ్యంతర బెయిల్ పిన్నెల్లి బయట ఉన్నారు.

ఇటీవల మొత్తం నాలుగు కేసుల్లో మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తుది తీర్పు వెలువరించింది. ఆ నాలుగు పిటిషన్లను కొట్టేసింది. కాగా పిన్నెల్లి ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈరోజు లేదా రేపు పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం. మరోసారి పారిపోకుండా పిన్నెల్లిపై పోలీసులు గట్టి నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఓటమి చెందిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version