BREAKING : అమరావతి అసైన్డ్ భూముల కేసులో బిగ్‌ ట్విస్ట్ !

-

అమరావతి అసైన్డ్ భూముల కేసులో బిగ్‌ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీకి సరికొత్త ఆధారాలు లభించాయి. అమరావతి అసైన్డ్ భూముల కేసును మళ్ళీ ఓపెన్ చేస్తూ హై కోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ రెండు పిటిషన్లు ఫైల్ చేసింది. ఈ మేరకు సీఐడీకి మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు కృష్ణప్రియ ఆడియో, వీడియో ఆధారాలు అందజేశారు.

Big twist in Amaravati assigned land case

ఇందులో నారాయణ, తదితరులు ఏ విధంగా అక్రమంగా భూములు కొనుగోలు చేసిందని..ఎసైన్డ్ భూములున్న దళితులు, ఇతర బలహీనవర్గాలవారిని అధికార దర్పంతో బలంతో ఏ విధంగా బెదిరించినది…ఏ విధంగా వాటిని కాజేసినదీ కృష్ణప్రియ వివరించారు. ఈ నేపథ్యంలో కేసును రీ – ఓపెన్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. వాస్తవానికి ఆ భూముల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని పేర్కొంటూ ఈ కేసును కొట్టేయాలని గతంలోనే కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో విచారణ ముగియగా తీర్పును హైకోర్టు ఈనెల 16వ తేదికి వాయిదా వేసింది. ఎల్లుండి సోమవారం తీర్పు రానున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కేసును రీ ఓపెన్ చేయాలంటూ సీఐడీ పిటిషన్ వేయడం నారాయణకు కొత్త చిక్కులు తెచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version