73 ఏళ్ల చంద్ర‌బాబును అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే కుట్ర – నారా లోకేష్

-

73 ఏళ్ల చంద్ర‌బాబును అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే కుట్ర చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్ర‌బాబుని అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే కుట్ర జరుగుతోందన్నారు నారా లోకేష్.

CID rains questions on Nara Lokesh

భ‌ద్ర‌త‌లేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయ‌న‌కి ప్రాణ‌హాని తల‌పెడుతున్నారని.. ఎన్న‌డూ ఏ త‌ప్పూ చేయ‌ని 73 ఏళ్ల చంద్ర‌బాబు ప‌ట్ల రాక్ష‌సంగా వ్య‌వ‌హ‌రిస్తోంది ఈ ప్ర‌భుత్వం అంటూ పేర్కొన్నారు నారా లోకేష్. చంద్ర‌బాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్ప‌దంగా ఉందని… జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న చంద్ర‌బాబుని ముద్దాయి అని హెల్త్ బులెటిన్లో ప‌దే ప‌దే పేర్కొన్నారని గుర్తు చేశారు. ముద్దాయి అనేందుకు పెట్టిన శ్ర‌ద్ధ చంద్రబాబు ఆరోగ్యం, భ‌ద్ర‌త‌పై పెట్ట‌డంలేదని.. చంద్ర‌బాబుకి ఏ హాని జ‌రిగినా, సైకో జ‌గ‌న్ స‌ర్కారు, జైలు అధికారుల‌దే బాధ్య‌త‌ అన్నారు నారా లోకేష్. చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష? చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉందని ఫైర్‌ అయ్యారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version